నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్
AP: అనంతపురంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. తన ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన 12 తులాల నగలను డ్రైవర్ చంద్రశేఖర్ పోలీసులకు అప్పగించారు. తర్వాత బాధితురాలు లక్ష్మిగా గుర్తించిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు పిలిపించి బంగారు నగలను అప్పగించారు. నిజాయితీతో నగలను అందించిన ఆటో డ్రైవర్‌ను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.