మత్స్యకార గ్రామాల్లో పర్యటించిన ప్రత్యేక అధికారి
VZM: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి రవి సుభాష్ సముద్ర తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సోమవారం పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, ఆర్డీవో కీర్తి ఉన్నారు.