తొలకరి వర్షాలలో నవధాన్యాలు సాగు అవసరం

SKLM: తొలకరి వర్షాలలో నవధాన్యాలు సాగు చేయడం ద్వారా భూసారం పెంచేందుకు అవకాశం ఉంటుందని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ తోట రమణ తెలిపారు. మంగళవారం నరసన్నపేట మండలం రైతు సేవా కేంద్రంలో రైతులకు నవధాన్యాలు అందించేందుకుగాను కిట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. నవధాన్యాలు వేసుకోవడం వలన వ్యవసాయానికి పనికొచ్చే సూక్ష్మజీవులు ఉత్పత్తి జరుగుతుందన్నారు.