నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
VSP: పెందుర్తి మండలం చినముషిడివాడ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు జోన్-3 ఈఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. చినముషిడివాడ పాత గ్రామం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంతం, ఎస్సీ, బీసీ, నాగేంద్ర, చిన్నయ్య కాలనీల్లో సరఫరాకు అంతరాయం కలుగనుందని, వినియోగదారులు అధికారులకు సహకరించాలని ఈఈ కోరారు.