లేబర్ కోడ్లు రద్దయ్యేదాకా పోరాటం: CITU
GDWL: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు రద్దయ్యేంతవరకు కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సిఐటియు జెండాను కార్యకర్తలతో కలిసి ఎగరవేశారు. అయన మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు సంఘటితంగా పోరాడాలన్నారు.