"మారుమూల ప్రాంతాల్లో న్యాయ సేవలను విస్తరించడమే లక్ష్యం"
WGL: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ఆదేశాల మేరకు మామునూరు, రామచంద్రాపురం, బొల్లికుంట గ్రామాల్లో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇంటింటా ప్రచారం చేస్తూ వివిధ చట్టాలు, న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ.. న్యాయ సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యమని అన్నారు.