నేడు ఎమ్మెల్యే పంచకర్ల పర్యటన వివరాలు
VSP: ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఇవాళ సబ్బవరంలో పర్యటిస్తారని సబ్బవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన బాలికల వసతిగృహాన్ని, తర్వాత సబ్బవ రంలో వేర్వేరు చోట్ల నిర్మించిన రోడ్లను ప్రారంభిస్తారన్నారు. అనంతరం సబ్బవరం డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొంటారని తెలిపారు.