మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన బాలకృష్ణారెడ్డి

మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన బాలకృష్ణారెడ్డి

KDP: మైదుకూరు నియోజకవర్గ వైసీపీ స్టూడెంట్ వింగ్ నూతన అధ్యక్షుడు భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి నియమితుడయ్యాడు. ఈ మేరకు సోమవారం మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లి రఘురామిరెడ్డిని ప్రొద్దుటూరులోని వారి నివాసంలో కలిసి, సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యత్తపు సుబ్బారెడ్డి, పొలిమేర కృష్ణారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.