బెల్టు దుకాణంపై దాడి.. 16 లీటర్ల మద్యం స్వాధీనం!
SRPT: మద్దిరాల మండలం మద్దిరాలలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్టు దుకాణంపై ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం ఇవాళ మెరుపు దాడి చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. దుకాణం నుంచి 16 లీటర్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ధృవీకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.