గల్లంతైన బీటెక్ విద్యార్థి మృతదేహం లభ్యం
ప్రకాశం: త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద రెండు రోజుల క్రితం సాగర్ కాలువలో గల్లంతైన సురేందర్ రెడ్డి మృతదేహం శుక్రవారం ఉదయం కురిచేడు మండలంలోని నాయుడుపాలెం వద్ద లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. సురేందర్ రెడ్డి గుంటూరులోని ఓ బీటెక్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.