'మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి'

NTR: ఆదివారం ఆటోనగర్‌లోని పటమట పోలీస్టేషన్ రోడ్డులో, పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ పవన్ కిషోర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ద్వారా వాతావరణ సమతుల్యత సాధించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.