రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
AKP: ఎలమంచిలి(మం) పులపర్తి వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రోలుగుంట మండలం వడ్డిప గ్రామానికి చెందిన అల్లు రాజు(34), అల్లు అమ్మాజీ(60) ఎలమంచిలి ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి బైక్‌పై స్వగ్రామం వస్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజును నేషనల్ హైవే వాహనంపై అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.