కాప్‌ సదస్సులో అగ్ని ప్రమాదం

కాప్‌ సదస్సులో అగ్ని ప్రమాదం

బ్రెజిల్‌లోని బెలెమ్‌లో నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి కాప్-30 వాతావరణ శిఖరాగ్ర సదస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సదస్సుకు హాజరైన వేల మంది రక్షణ కోసం పరుగులు తీశారు. దట్టమైన పొగతో కూడిన గాలిని పీల్చడంతో 13 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.