గంగ జాతర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

TPT: చిల్లకూరులో జరుగుతున్న గంగమ్మ జాతర వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే పి.సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతోపాటు పెంచలకోన ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి ఆయన చేత పూజలు చేయించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మ్రొక్కులు తీర్చుకున్నారు.