పర్వతగిరిలో హిట్ అండ్ రన్.. వ్యక్తికి గాయాలు

పర్వతగిరిలో హిట్ అండ్ రన్.. వ్యక్తికి గాయాలు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అర్శం నరేష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఫ్రూట్ షాప్ మూసివేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టి పరారైంది. గాయపడిన నరేష్‌ను అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.