VIDEO: డ్వాక్రా వీవోఏలకు సెల్‌ఫోన్లు పంపిణీ
VSP: పెందుర్తి సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 136 మంది వీవోఏలకు రూ. 20.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లు శనివారం పంపిణీ చేశారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. డ్వాక్రా కార్యకలాపాల నిర్వహణకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28,500 మందికి ఫోన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.