'ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి'

SDPT: ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ కే. హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.