ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు

సత్యసాయి: మడకశిర మండలం రేకుల కుంట గ్రామాన్ని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సోమవారం సందర్శించారు. గ్రామ ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు వివరించారు. సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు.