తాడేపల్లిగూడెంలో ఉచిత షుగర్ రక్త పరీక్షలు
W.G: ప్రాథమిక దశలోనే షుగర్ వ్యాధిని గుర్తించి, నియంత్రించాలని వాసవి ఇంజనీరింగ్ కళాశాల పాలకవర్గ ఛైర్మన్ గ్రంధి సత్యనారాయణ సూచించారు. మంగళవారం తాడేపల్లిగూడెం కడగట్ల జనతా ఆసుపత్రిలో ఉచిత షుగర్ వ్యాధి రక్త పరీక్ష శిబిరం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం నడక అలవాటు చేసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని అదుపు చేయవచ్చన్నారు. అనంతరం 124 మందికి రక్త పరీక్షలు చేశారు.