ABC సెంటర్‌ను తనిఖీ చేసిన పురపాలక కమిషనర్
నంద్యాల పురపాలక కమిషనర్ బండి శేషన్న పట్టణంలోని భీమవరం రోడ్డులోని ABC సెంటర్ ను తనిఖీ చేశారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకున్నమన్నారు. కుక్కలకు జరుగుతున్న శస్త్ర చికిత్స వివరాలను, అందిస్తున్న ఆహారం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వాటికి పాలు, గుడ్డు, చికెన్‌తో కూడిన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండటంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.