దారుణంగా మారిన రహదారి

NZB: రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే కాకుండా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా చూడడం కూడా అధికారుల బాధ్యత. కానీ ఏర్గట్ల మండలం నుంచి జగిత్యాల జిల్లా వర్షకొండ వైపు వెళ్లే రహదారి పరిస్థితి మళ్లీ దారుణంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు నాయకులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.