'PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

GNTR: గుంటూరు జీఎంసీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్, డీవైసీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆదివారం కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు 'డయల్ యువర్ కమిషనర్' (ఫిర్యాదుల నంబర్ 0863-2224202),10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 'పీజీఆర్ఎస్ కార్యక్రమం' జరుగుతుందని చెప్పారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.