వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

MBNR: నవాబుపేట మండలం లోకిరేవు గ్రామానికి చెందిన తెలుగు శ్రీను అదృశ్యమయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనులకు వెళ్లి వస్తానని చెప్పి ఈనెల 20న ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శ్రీను భార్య జంగమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.