వయోజన విద్యా శాఖ ప్రాజెక్టు అధికారికి పదోన్నతి

వయోజన విద్యా శాఖ ప్రాజెక్టు అధికారికి పదోన్నతి

మంచిర్యాల జిల్లా వయోజన విద్యా శాఖ ప్రాజెక్టు అధికారి అజ్మీర పురుషోత్తం నాయక్‌కు పదోన్నతి లభించింది. నిజామాబాద్ జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌గా ఆయన పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వయోజన విద్యా జిల్లా రిసోర్స్ పర్సన్స్ శనివారం ఘనంగా సత్కరించారు. వయోజనులను విద్యావంతులను చేయడానికి పురుషోత్తం ఎంతో కృషి చేశారని కొనియాడారు.