సంస్కృతిని చాటి చెప్పేలా బీచ్ ఫెస్టివల్

కృష్ణ: బందరు చరిత్రను, సంస్కృతిని చాటి చెప్పేలా ఈ సారి బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి మంగినపూడి బీచ్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు. మంగినపూడి బీచ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన అన్నారు.