బైక్ ఢీకొని వృద్ధుడు మృతి

బైక్ ఢీకొని వృద్ధుడు మృతి

పల్నాడు: రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో మాచర్ల-గుంటూరు రహదారిపై ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో సుమారు 70 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు.