VIDEO: 'ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది నియామకాలు చేపట్టండి'

E.G: రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది నియామకంపై ఒప్పంద నిబంధనలు పాటించని ఏజెన్సీకి చెల్లింపుల్లో కోత విధించాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది సిబ్బందికి కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు.