భార్య హత్య కేసులో భర్త అరెస్ట్

KRNL: కోసిగి మండలంలోని చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన దుద్ది రామలక్ష్మీ (50)ను హత్య చేసిన భర్త నరసింహులును సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 30వ తేదీన మద్యం తాగి భార్యతో గొడవ పెట్టుకున్న నరసింహులు, రోకలి బండతో ఆమె తలపై కొట్టి హత్య చేశారు. మృతురాలి కుమారుడు ఉసేన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసారు.