బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
KNR: బైక్ కొనివ్వలేదన్న మనస్తాపంతో కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్‌కు చెందిన రిత్విక్ (17) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట డబ్బులు రాగానే కొనిస్తానని తండ్రి చెప్పినా వినకుండా, ఈనెల 6న గడ్డిమందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.