VIDEO: నకిలీ ముందులతో 8 ఎకరాలు సజ్జ పంట నష్టం
KDP: బద్వేల్ నియోజకవర్గం బి.కోడూరు మండలం కృష్ణాపురంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన వెంకటయ్య, నాగయ్య అనే రైతులు 8 ఎకరాల్లో సజ్జ పంట వేశారు. అయితే గడ్డి నివారణకు ఏజెంట్ రామచంద్రయ్య వద్ద పరుగుమందులు వాడారు. దీంతో పంట మొత్తం ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో తమకు సుమారు రూ.8 లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు.