నిఘా నీడలో పుట్టపర్తి.. డ్రోన్లతో పహారా
SS: సత్యసాయిబాబా జన్మదిన వేడుకల నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతను మరింత పటిష్టం చేశారు. పటిష్ట బందోబస్తులో భాగంగా రాత్రిపూట కూడా నిఘా కోసం పోలీసులు 'నైట్ విజన్ డ్రోన్లను' వినియోగిస్తున్నారు. పట్టణంలోని ముఖ్య ప్రాంతాలు, ప్రశాంతి నిలయం పరిసరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు తెలిపారు.