ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

WGL: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బర్ల శివ, ముగ్గుల రాజమోహన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మండలం అధ్యక్షుడు కొండేటి శ్రీకాంత్ పాల్గొన్నారు.