పౌల్ట్రీ రంగాభివృద్ధికి కృషి: మంత్రి వాకిటి శ్రీహరి
TG: పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ రాష్ట్ర జీడీపీకి రూ.22,938 కోట్లు సమకూరుస్తోందని తెలిపారు. దేశంలో గుడ్ల ఉత్పత్తిలో TG 3వ స్థానంలో, బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. పౌల్ట్రీ వ్యాధులను నివారించడానికి పశుసంవర్ధక శాఖ సిద్ధంగా ఉందన్నారు.