గుంటూరు జిల్లా గర్వకారణం ఎస్. జానకి

గుంటూరు జిల్లా గర్వకారణం ఎస్. జానకి

GNTR: ప్రసిద్ధ గాయని ఎస్. జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లాలోని పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం అంతా గుంటూరులోనే గడిచింది. చిన్నతనం నుంచే స్థానిక నాటకాల్లో పాడుతూ తన గాన ప్రస్థానాన్ని ఇక్కడే మొదలుపెట్టారు. సంగీత రంగంలో 4 జాతీయ అవార్డులు, 33 నంది అవార్డులను అందుకున్నారు. అందుకే గుంటూరు ప్రజలు ఆమెను తమ గర్వకారణంగా భావిస్తారు.