'ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి'

'ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి'

GDWL: జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఏకగ్రీవాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏకగ్రీవాల వల్ల కులం, డబ్బు ప్రాతిపదికన కేవలం పెత్తందారులకు, ధనవంతులకే రాజకీయ అవకాశం ఉంటుందని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.