ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్

ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్

AKP: ఎస్.రాయవరం మండలం దార్లపూడి, తిమ్మాపురం, భీమవరం, ఎస్ రాయవరం గ్రామాల్లో శనివారం ఇంటి పన్నుల వసూళ్లపై డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఇంటి పన్నులను వసూళ్లు చేశారు. శతశాతం ఇంటి పన్నులను వసూలు చేసి పంచాయతీలకు ఆదాయం పెంచుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో సూచించారు.