కృష్ణాతీరాన సోమశిల వైభవం..

కృష్ణాతీరాన సోమశిల వైభవం..

NGKL: సోమశిలలోని శ్రీలలిత సోమేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక విశిష్టతకు నిలయం. 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన ఈ పురాతన క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట కొలువై ఉండటం అత్యంత విశేషం. కృష్ణానది తీరాన వెలిసిన ఈ ఆలయం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలకు ప్రసిద్ధి. ప్రకృతి సౌందర్యం, చారిత్రక వైభవం కలబోసిన ఈ పుణ్యక్షేత్రం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.