ఘోరం.. ప్రాణం తీసిన నాటు వైద్యం

ఘోరం.. ప్రాణం తీసిన నాటు వైద్యం

NGKL: జిల్లాలో విషాద ఘటన జరిగింది. బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో నాటు వైద్యుడు నిరంజన్, భార్య చాన్బి (65), కూతురు షమీనా నాటు వైద్యం చేసేందుకు మందును తయారు చేస్తుండగా  శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా చాన్బి మృతి చెందింది. నిరంజన్, షమీనా చికిత్సలో ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.