మద్యం తాగొద్దన్నందుకు కొడుకు, కోడలిపై కాల్పులు!

మద్యం తాగొద్దన్నందుకు కొడుకు, కోడలిపై కాల్పులు!

మద్యం తాగొద్దనందుకు ఓ వ్యక్తి కొడుకు, కోడలిపై కాల్పులు జరిపిన ఘటన యూపీ గోరక్‌పూలో జరిగింది. రిటైర్డ్ హోంగార్డ్ అయిన హరియాదవ్ రోజూ మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తున్నాడు. ఎప్పటిలాగే నిన్న కూడా తాగి వచ్చి గొడవకు దిగడంతో కొడుకులు, కోడళ్లు మద్యం తాగొద్దని సూచించారు. దీంతో ఆగ్రహించిన హరి. పెద్దకుమారుడు, చిన్న కోడలిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.