ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి
NLR: వెంకటాచలం మండలం ఇస్లాంపేటలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంగళవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి హాజరయ్యారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పవిత్ర నెలలో ఇఫ్తార్ విందులు సామాజిక సౌహార్దాన్ని పెంపొందించే వేదికలని ఆయన పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.