'ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలి'
WNP: జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత ఈ మండలాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందన్నారు.