'తణుకు ఏఎంసీకి రూ. 9.35 కోట్ల ఆదాయం'

'తణుకు ఏఎంసీకి రూ. 9.35 కోట్ల ఆదాయం'

W.G: తణుకు మార్కెట్ కమిటీ పరిధిలో గోదాములు, పుంత రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఛైర్మన్ కొండేటి శివ తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో 2025-26 ఏడాదికి రూ.9.35 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఈ నిధులతో మార్కెట్ అభివృద్ధి, రైతు సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.