నంద్యాల మున్సిపల్ యార్డులో అగ్ని ప్రమాదం

నంద్యాల: పట్టణంలోని పొన్నాపురం కాలనీలో ఉన్న మున్సిపల్ యార్డులో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించినట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యార్డులో ఉంచిన వేస్ట్ ప్లాస్టిక్ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిందన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు.