బంగారు షాపుల్లో సోదాలు.. నకిలీ హాల్ మార్క్ గుర్తింపు
AP: గుంటూరు లాలాపేటలో పలు బంగారం దుకాణాల్లో BIS అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. హాల్‌మార్క్ లేకుండా నగలు విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించిన అధికారులు.. ఆభరణాల నాణ్యతను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ నాణ్యత గల బంగారు నగలను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు సోదాల్లో గుర్తించారు. నకిలీ హాల్ మార్క్‌లను సైతం దుకాణదారులు వేస్తున్నట్లు నిర్ధారించారు.