పినపాకలో సాయి బాబా ఆలయ పదో వార్షికోత్సవం

పినపాక: శుక్రవారం ఏడూళ్ల బయ్యారంలో కొలువుదీరిన శ్రీ షిరిడీ సాయి బాబా ఆలయ 10 వార్షికోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి హారతినిచ్చారు. సాయి బాబా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బాబాను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగగా దాదాపు 1000మందికి అన్న ప్రసాదం అందజేశారు.