రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

NZB: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్‌లో స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. లోకల్ పోలీస్ డాగ్ స్క్వాడ్ టీంతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది అనుమానితుల లగేజీని తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, రైళ్లు, పార్సిల్ కార్యాలయం, పార్కింగ్ ప్రాంగణంను తనిఖీలు నిర్వహించారు.