ఉత్తమ సేవకు అవార్డు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీబీ యూనిట్‌లో సీనియర్ చికిత్స పర్యవేక్షకులుగా పనిచేస్తున్న దేవ తిరుపతికి హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్మూలనలో చేసిన కృషికి అవార్డు లభించింది. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ వాణిశ్రీ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కేవీ. సుధాకర్ రెడ్డిలు ఈ పురస్కారాన్ని అందజేశారు.