రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కోనసీమ: అమలాపురం పేరూరు వై జంక్షన్ సమీపంలో హెచ్పీ గ్యాస్ కంపెనీ వద్ద సోమవారం రాత్రి ఆర్టీసీ బస్, బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన రేవు దినేష్ కుమార్(28) గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.