తెగుళ్లు వచ్చి పంట నష్టం

తెగుళ్లు వచ్చి పంట నష్టం

AKP: మండలంలోని పలు గ్రామాల్లో బీరపంట రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. రామన్నపాలెనికి చెందిన డీ. పైడిరాజు హెక్టారుకు రూ.2.50 లక్షల మేర పెట్టుబడి పెట్టి బీర సాగు చేశారు. అకాలవర్షాల కారణంగా పొలాల్లో నీరు నిల్వ ఉండి మొక్కలకు తెగుళ్లు పట్టాయి. స్ప్రే చేసినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.