'శివాలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలి'
ASR: జిల్లాలోని అన్ని ప్రధాన శివాలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అమిత్ బర్దార్ ఆదివారం పోలీసులను ఆదేశించారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా రేపు శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. పాడేరు ఉమాలింగేశ్వర, చింతపల్లి, సీలేరు ఉమాశంకర, హుకుంపేట మత్స్యలింగేశ్వర తదితర ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.